telugu language

శ్రౌత శైవం – వేదములు, శైవాగమాలు, ఇతిహాస, పురాణాలు  శ్రౌత శైవ సంప్రదాయానికి ప్రమాణములు. శ్రౌత శైవ మతము సనాతనధర్మంలో ప్రతిపాదించబడిన వేదం, శృతి, ఉపనిషత్తులు, ఆగమములు, పురాణములు, ఇతిహాసముల పట్ల పూర్తి భక్తి ప్రపత్తులు కలిగి ఉండి, మహాదేవుడైన ఆ సదాశివుని పూజిస్తూ, ఇతర దేవతలు , పూజా విధానాల పట్ల పూర్తి భక్తి భావము కలిగి ఉండే మతము. కర్మాచరణ కోసం ఉపనయన సంస్కారం (నిత్య సంధ్యావందనాది తదితర కర్మలు ఆచరించుచూ) జ్ఞానం కోసం గురుముఖత  శాంభవ దీక్ష (లింగధారణ) చేసుకుని ఎప్పుడూ శివ ధ్యానం, శివ పూజలు , శివ వ్రతాలు చేసే బ్రాహ్మణులు “ఆరాధ్య బ్రాహ్మణులు” అని పిలవబడుతున్నారు. ఈ సంప్రదాయానికి ఆలంబనగా శ్రీ శైవ మహాపీఠము కలదు. పరమ పూజనీయులైన పీఠాధిపతి గారి నేతృత్వములో ఆరాధ్యులు లేదా ఆరాధ్య బ్రాహ్మణులు తమ సంప్రదాయం కొనసాగిస్తున్నారు. ఈ సంప్రదాయం లో ఎంతో మంది మహనీయులు, సంఘసంస్కర్తలు, కళాకారులు, వివిధ రంగాలలో లబ్ధ ప్రతిష్ఠితులు కలరు. ప్రముఖులు అన్న పేజీ లో అట్టి వారి వివరములు ఇవ్వబడీనవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *